తన 6వ చిత్రంలో ఓ పాటకి తనదైన స్టైల్‌లో స్టెప్పులేశారు చిరంజీవి. అక్కడున్న వారంతా చిరును మెచ్చుకున్నారు. ఆ చిత్రానికి మేనేజరుగా ఉన్న వెంకన్నబాబు చిరంజీవిని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్లి ‘ఎలా ఉంది?’ అని చిరంజీవి అడగ్గా.. ‘నీ వెనక ఉన్న డ్యాన్సర్లు ఏం చేశారో, నువ్వూ అదే చేశావు. నీ ప్రత్యేకత లేకపోతే ఎందుకట?’ అని సమాధానం ఇచ్చారాయన. ‘అప్పుడే పాటని ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేయడం అలవాటు చేసుకొన్నా’ అని ఓ సందర్భంలో చిరంజీవి గుర్తు చేసుకున్నారు.