ఇంటికి మామిడి తోరణాలు అందుకే కడతారు.!

85చూసినవారు
ఇంటికి మామిడి తోరణాలు అందుకే కడతారు.!
సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సమయంలో ఇంటికి తోరణాలు కడుతూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం మామిడి ఆకుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మామిడాకులు అలంకరణకు ఉపయోగపడటం మాత్రమే కాదు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉంది. మామిడి ఆకులు ఇంటికి కడితే ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా నిరోధిస్తుందని హిందువుల నమ్మకం. మామిడి ఆకులు గాలి నాణ్యతను పెంచుతాయట. అంతేకాకుండా వీటిని లక్ష్మీదేవికి చిహ్నంగా హిందువులు భావిస్తారు.

సంబంధిత పోస్ట్