ఉత్తరప్రదేశ్లోని 10 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో సమాజ్వాదీ పార్టీ - కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఎనిమిది సీట్లలో సమాజ్వాదీ పార్టీ, రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. ఈ మేరకు ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధురీ వెల్లడించారు. అయితే.. ఈ విషయం తమకు తెలీదంటూ కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు.