పంటకాలం పూర్తయ్యాక 80 నుంచి 90 శాతం రైతులు మిగిలిన వరి కొయ్యలను, పత్తి, మిరప, మొక్కజొన్న కట్టెలను పొలంలోనే మంటపెట్టి కాల్చేస్తున్నారు. ఇలా కాల్చడం వల్ల విపరీతమైన వేడి కారణంగా భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా పంట ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరమైన సేంద్రియ కర్బనం, నత్రజని, పాస్పరస్ లాంటి పోషకాల శాతం తగ్గుతుంది. జవసత్వం నింపే మొక్కలు, ఇతర పదార్థాలు కలిస్తేనే నేల సారాన్ని పెంపొందించుకుంటుంది.