మువ్వన్నెల జెండా రంగుల్లో శ్రీశైలం డ్యాం అందాలు (వీడియో)

59చూసినవారు
శ్రీశైలం జలాశయం మువ్వన్నెల జెండా రంగులతో ఆకట్టుకుంటోంది. డ్యాం క్రస్ట్ గేట్ల వద్ద కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న విద్యుత్ దీపాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు, మరోవైపు విద్యుత్ కాంతులతో ఆ ప్రాంతం మెరిసిపోతోంది. ప్రస్తుతం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్ డ్యాంకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 3.79 లక్షలు, ఔట్ ఫ్లో 3.32 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

సంబంధిత పోస్ట్