పెరూ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. రాజధాని లిమా నుంచి 40 మందికి పైగా ప్రయాణికులతో బస్సు ఆండియన్ ప్రాంతానికి బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లిందని అక్కడి అధికారులు తెలిపారు.