చిన్నారిని కాపాడిన పిల్లి.. వీడియో వైరల్

82చూసినవారు
చాలా మందికి పిల్లులంటే ఇష్టముండదు. అయితే ఓ పెంపుడు పిల్లికి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఈ వీడియోలో ఓ ఇంట్లో పసిపాప పాకుతూ ఆడుకుంటోంది. ఆ సమయంలో సోఫాపై కూర్చొని పిల్లి ఆ చిన్నారిని చూస్తోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి మెట్ల వైపు వస్తుంది. అది గమనించిన పిల్లి పరుగున వచ్చి ఆ పాప కింద పడకుండా అడ్డు నిలుస్తుంది. సరైన సమయానికి పిల్లి రావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్