హైదరాబాద్ లోని సెక్రటరియేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించి.. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు.