నదిలో దూకిన ప్రేమజంట.. చివరికి ఏమైందంటే(వీడియో)

64చూసినవారు
నదిలో దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది ఓ ప్రేమజంట. వెంటనే స్థానిక మత్స్యకారులు నదిలోకి దూకి వారిని రక్షించారు. ఈ ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్‌లో జరిగింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి నదిలోకి దూకడం గమనించిన కొంతమంది మత్స్యకారులు వారిని కాపాడారు. అనంతరం యువకుడిని ఒడ్డుకు చేర్చిన ఓ వ్యక్తి.. ఆ ప్రియుడికి దేహశుద్ది చేశాడు. రెండు చెంపలు వాయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్