పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు

68చూసినవారు
పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలోని ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన పండితులు, ముస్లిం ప్రజలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే ఇరు వర్గాల ప్రజలు కలిసి హోమం చేశారు. ఆలయాన్ని తెరవడంతో గ్రామంలోని వలసేతర పండితులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్