155 సార్లు కంపించిన భూమి.. 8 మంది మృతి

577చూసినవారు
155 సార్లు కంపించిన భూమి.. 8 మంది మృతి
వరుస భూకంపాలతో జపాన్‌ వణికిపోతున్నది. సోమవారం నుంచి ఇప్పటివరకు 155సార్లు భూమి కంపించిందని జపాన్‌ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, సెంట్రల్‌ జపాన్‌లో సోమవారం నాటి భారీ భూకంపం వల్ల 8 మంది మరణించారని అధికారులు తెలిపారు. సునామీ రావడంతో వాజిమా పట్టణంలో దాదాపు 30 భవనాలు కుప్పకూలాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో 32,700 మందికి పైగా నివాసితులు అంధకారంలోనే ఉండిపోయారన్నారు. ఇషికావా తీరంలో అలలు విరుచుకుపడ్డాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్