పాకిస్థాన్ లో శాంతి భద్రతల కారణంగా కుమార్తె తలపై సీసీ కెమెరా అమర్చాడు ఓ తండ్రి. దీంతో తన కూతురు నిత్యం తన కనుసన్నల్లో ఉంటుందనేది ఆయన ఉద్దేశ్యం. ఈ విషయమై సదరు యువతి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు తెలిపింది. “దీంతో నా తండ్రి నన్ను 24 గంటల పాటు పర్యవేక్షిస్తుంటారు. ఇదంతా నా భద్రత కోసమే" అని చెప్పింది. తన తండ్రి నిర్ణయంపై ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయన తన కోసం తీసుకున్న ఏ నిర్ణయమైనా తనకు ఇష్టమేనని ఆమె చెప్పడం గమనార్హం.