ఆకాశం నుంచి దూసుకొచ్చిన శకలం.. ఎక్కడ పడిందంటే?

82చూసినవారు
ఆకాశం నుంచి దూసుకొచ్చిన శకలం.. ఎక్కడ పడిందంటే?
ఆకాశం నుంచి దూసుకొచ్చిన ఓ భారీ శకలం నేలను తాకింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలోని జోలార్పేటైలో చోటుచేసుకుంది. ఈ శకలం భూమిని తాకడం స్థానికంగా కలకలం రేపింది. మరో చెప్పుకోదగ్గ విషయం ఎంటంటే.. ఈ శకలం నేలను తాకిన చోట భారీ గొయ్యి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, నిపుణులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అది గ్రహశకలమా లేక ఏదైనా ఉపగ్రహంలోని భాగమా అన్నది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్