డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఛైర్మన్ డాక్టర్ సమీర్ V. కామత్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దీనిపై కేబినెట్ నియామకాల కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆమోదంతో సమీర్ కామత్ మే 31, 2025 వరకు DRDO ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేకి జూన్ 30 వరకు ఒక నెల సర్వీస్ పొడిగింపును ప్రభుత్వం ఆదివారం ఆమోదించింది.