శ్రీశైలం రిజర్వాయర్ కు ఎగువన ఉన్న ఆల్మట్టి, తుంగభద్ర, జురాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఇవాళే ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్లు ఓపెన్ చేసి నాగార్జునసాగర్ కు నీరు విడుదల చేయనున్నారు. తొలుత ఈ నెల 30న గేట్లు ఎత్తాలని అధికారులు భావించారు. కానీ ఊహించని విధంగా వరద వస్తుండటంతో ఇవాళే ఓపెన్ చేయాలని నిర్ణయించారు.