జమిలి బిల్లును జేపీసీకి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జేపీసీ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉండనున్నారు. రాజ్యసభ సభ్యుల పేర్లను ప్రతిపాదించిన తరువాతే కమిటీ ఛైర్మన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. కమిటీలో ఏపీ నుంచి ఎంపీలు సీఎం రమేశ్, బాలశౌరి, హరీశ్ బాలయోగి ఉన్నారు.