బిల్డింగ్‌పై కుప్పకూలిన విమానం.. LIVE VIDEO

66చూసినవారు
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక శిక్షణా విమానం నియంత్రణ కోల్పోయి ఓ బిల్డింగ్‌పై కుప్పకూలింది. ‘సెస్నా 208 కారావాన్’ అనే ప్యాసింజర్ విమానం కంట్రోల్ తప్పి ఖాళీగా ఉన్న ఓ భవనాన్ని ఢీకొట్టిందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 22 ఏళ్ల ట్రైనీ పైలట్ హిరమ్ డిఫ్రైస్, మరో ప్యాసింజర్ మృతి చెందారని పేర్కొన్నారు. కాగా, విమానం కూలుతున్న దృశ్యాలు రహదారిపై వెళుతున్న వాహనాల డాష్ బోర్డు కెమెరాల్లో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్