గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్

70చూసినవారు
గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
వరంగల్ జిల్లా ఏనుమాముల పోలిస్ స్టేషన్ వద్ద గన్ మిస్ ఫైర్ ఘటన కలకలం రేపుతోంది. గార్డ్ డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రాజేష్ వెపన్ మిస్ ఫైర్ అయింది. దీంతో అతడి ఎడమ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. దీంతో కానిస్టేబుల్ ను ఎంజీఎంకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్