అత్యంత భారీ వర్షపాతం నమోదైతే అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టాలని చెప్పేందుకు రెడ్ ను, చర్యలకు సిద్ధంగా ఉండాలనేందుకు ఆరెంజ్ హెచ్చరికలను ఐఎండీ జారీ చేస్తుంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని చెప్పేందుకు ఎల్లో అలర్ట్ ఇస్తుంది. రెడ్ అలర్ట్ అంటే ఒకరోజులో 204.5 మిమీ లేదా అంతకు మించి వర్షాలు (20.5 సెం.మీ పైగా) పడే అవాకాశం ఉందని అంచనా. 115.6-204.4 మి.మి వర్షపాతం కురిసే అవకాశం ఉన్నప్పుడు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేస్తారు.