ఒకే బైక్‌పై ఏడుగురు యువకుల ప్రయాణం.. వైరల్ వీడియో

75చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో ఓ బైక్‌పై ఏడుగురు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా ఒక బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా ఎదుర్కోక తప్పదు. అలాంటిది ఒకే బైకుపై ఏడుగురు వెళ్లడం అంటే మాములు మాటలు కాదు. దీంతో ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్