మహారాష్ట్రలోని జల్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశ్రాంతి తీసుకుంటున్న కూలీలపై ట్రక్కు డ్రైవర్ ఇసుక కుమ్మరించారు. దీంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. నిద్రిస్తున్న కూలీలను గమనించకుండా ట్రక్కు డ్రైవర్ ఇసుక అన్‌లోడ్ చేశారు. ఇసుక అన్‌లోడ్ చేసినప్పుడే షెడ్డు కూలడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. శిథిలాల నుంచి బాలిక, మహిళను సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.