రోలెక్స్ వాచీ తెచ్చిన చిక్కు.. దేశాధ్యక్షురాలి ఇంట్లో సోదాలు

84చూసినవారు
రోలెక్స్ వాచీ తెచ్చిన చిక్కు.. దేశాధ్యక్షురాలి ఇంట్లో సోదాలు
పెరూ దేశ అధ్యక్షురాలు డైనా బులురెటే ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆమె రోలెక్స్ వాచీనే ఇందుకు కారణం. ప్రజా రికార్డుల్లో చూపించని ఖరీదైన వాచీని ఆమె పెట్టుకున్నారంటూ పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేరం రుజువైనా పదవీకాలం పూర్తయ్యే వరకు ఆమెపై చర్యలు తీసుకోలేరు.

సంబంధిత పోస్ట్