24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ స్టార్

60చూసినవారు
24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ స్టార్
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అర్చనా కామత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్‌లో ఉన్నత విద్య చదివేందుకు ఆమె 24 ఏళ్లకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే ఆర్థిక అవసరాలు, మరో నాలుగేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆటకు వీడ్కోలు పలికినట్లు సమాచారం. టీటీ భారత జట్టు తొలిసారి పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించడంలో అర్చనా కామత్ కీలక పాత్ర పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్