ఈఫిల్ టవర్ ఎక్కిన వ్యక్తి.. వీడియో వైరల్

61చూసినవారు
ఒలింపిక్స్ ముగింపు రోజున పారిస్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎటువంటి ఆధారమూ లేకుండా కేవలం ఒట్టి చేతులతో ఓ వ్యక్తి ఈఫిల్ టవర్ ఎక్కేశాడు. దీంతో ముందు జాగ్రత్తగా టవర్ వద్ద నుంచి పర్యాటకుల్ని పోలీసులు ఖాళీ చేయించారు. ఒలింపిక్ రింగ్స్ దాటి ఇంకా పైకి ఎక్కుతున్న అతడిని మధ్యలో అడ్డుకుని వారు అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్