ఉపవాసం, జాగారం వెనుక అసలు కథ!

4135చూసినవారు
ఉపవాసం, జాగారం వెనుక అసలు కథ!
మహాశివరాత్రి రోజంతా భక్తులు ఉపవాసం ఉండి శివయ్యను ధ్యానిస్తూ ఉంటారు. రాత్రికి జాగారం ఉండి లింగమూర్తికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అసలు శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారనే దాని వెనుక ఓ కథ ఉంది. క్షీరసాగర మథన సమయంలో వచ్చిన ఆలాహలాన్ని శివుడు తన కంఠంలో బంధిస్తాడు. గరళం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకూ జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం సమయంలో శివనామ స్మరణం, జప ధ్యానాలతో కాలక్షేపం చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం.

సంబంధిత పోస్ట్