2015 నుంచి రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్న స్వప్నిల్ కుశాల్.. భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని స్ఫూర్తిగా తీసుకొని పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకునే ధోనీ తీరు స్వప్నిల్‌కు బాగా నచ్చుతుంది. తీవ్ర ఒత్తిడితో కూడిన షూటింగ్‌లో.. స్వప్నిల్ కూడా కూల్‌గా ఉంటాడు. ధోనీ బయోపిక్‌ను ఎన్నో సార్లు చూసిన స్వప్నిల్.. మహీ జీవితం నుంచి ప్రేరణ పొందాడు.