166 ఏళ్ళ తర్వాత ఇండియాకు చేరిన వీరుడి పుర్రె

75చూసినవారు
166 ఏళ్ళ తర్వాత ఇండియాకు చేరిన వీరుడి పుర్రె
బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హవల్దారుగా పనిచేసిన భారత వీరుడు ఆలం బేగ్‌ పుర్రె 166 ఏళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత లండన్‌ నుంచి భారత దేశానికి తీసుకొచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన ఆలం బేగ్‌ 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. ఈయన 46వ బంగాల్‌ రెజిమెంటులో పదాతిదళ సైనికుడిగా పనిచేసేవారు. బ్రిటీష్​ ప్రభుత్వంపై తిరుగుబాటులో చురుగ్గా పాల్గొన్న కారణంగా ఆలం బేగ్‌ను దారుణంగా హత్య చేసి.. అతడి పుర్రెను బ్రిటిష్‌ రాణికి కానుకగా లండన్‌కు పంపారు.

సంబంధిత పోస్ట్