కుటుంబంలో ఒక్కరు లేదా ఇద్దరు పొడుగ్గా ఉండటం కామన్. కానీ, మహారాష్ట్రలోని పుణేలో కులకర్ణి కుటుంబంలో ఉన్న నలుగురూ తలెత్తుకుని చూసేంత ఎత్తుగా ఉన్నారు. అంతేకాదు కులకర్ణి కుటుంబం ఇండియాలోనే అత్యంత ఎత్తైనది. గతంలోనూ ఈ కుటుంబం అత్యంత ఎత్తైన కుటుంబంగా లిమ్కా బుక్ వరల్డ్ రికార్డులోనూ చోటు సంపాదించుకుంది. కులకర్ణి 6.8 ఫీట్, భార్య 6.2 ఫీట్, మొదటి కూతురు 6.6 ఫీట్, రెండో కూతురు 6.4 ఫీట్ ఉన్నారు.