ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

78చూసినవారు
ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు
నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం రాణాపూర్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తా పడింది. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. అందులో సుమారు 50 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. 20 మంది వరకు తీవ్రంగా గాయపడగా నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్