విషాదం: కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత

85017చూసినవారు
విషాదం: కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కర్వీర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఎన్ పాటిల్ (71) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆదివారం బాత్‌రూమ్‌లో జారి పడిపోవడంతో బ్రెయిన్‌ హెమరేజ్‌ అయింది. గత 4 రోజులుగా ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ మరణించారు. దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు కాంగ్రెస్‌లో గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందారు. ఆయన స్వగ్రామమైన సదోలి ఖల్సాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్