కోడలిని దారుణంగా గొంతు కోసి చంపిన మామ

45636చూసినవారు
కోడలిని దారుణంగా గొంతు కోసి చంపిన మామ
అనుమానంతో కోడలిని మామ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో చోటు చేసుకుంది. రేచపల్లి గ్రామానికి చెందిన వివాహితను ఆమె మామ ఆకుల రాజిరెడ్డి బుధవారం తెల్లవారుజామున హత్య చేసినట్లు తెలుస్తుంది. మృతురాలి భర్త తిరుపతి రెడ్డి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. అయితే కోడలికి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే మామ హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్