భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. పోలీసుల రాకతో విముక్తి

88078చూసినవారు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉండే భార్యాభర్తలు పత్తి కృష్ణ(50), భారతి (45) మధ్య రెండు ఫ్లాట్ల విషయంలో గొడవ జరిగింది. భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా, కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య 3 రోజుల క్రితం పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి కృష్ణను విముక్తి చేయగా.. 3 రోజుల నుండి తనను కొడుతూ బాధలు పెట్టారని పోలీసుల ముందు ఏడ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్