తాజాగా నెట్టింట మరో భయానక వీడియో ట్రెండింగ్‌లో ఉంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువకుడు న్యూయార్క్ నగరంలో అత్యంత భయానక స్టంట్ చేశాడు. అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ భవనంపై ఉన్న యాంటీనాను ఎక్కి సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అత్యంత ప్రమాదకరంగా యాంటీనాపై తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియో రికార్డు చేసుకున్నాడు. ఇక వీడియో నెట్టింట సంచలనంగా మారింది.