మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా పుణెలో భారీగా ఈ వైరస్ కేసులు బయటపడుతున్నాయి. జూన్ నుంచి ఇప్పటి వరకూ దాదాపు 66 జికా వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అందులో 26 మంది గర్భిణిలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వైరస్ బారిన పడిన గర్భిణి స్త్రీల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.