పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. అంతేకాకుండా ఎముకలు బలహీనపడటం, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.