పర్యావరణహిత గణపతికి పూజలు చేయాలని రోటరీ వంటి సంస్థలు, ప్రకృతి ప్రేమికులు విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. రసాయన విగ్రహాలతో గాలి, నీరు, నేల కాలుష్యమై పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని అవగాహన కల్పిస్తున్నారు. ఉచితంగా మట్టి ప్రతిమలను పంచుతున్నారు. సహజమైన విఘ్నేశ్వరుని ప్రతిమలు తయారు చేసి పసుపు, కుంకుమ, పూలు, వివిధ రకాల ఆకులతో పూజలు చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. పందిళ్లలో కొందరు పర్యవణహిత గణపతులను ఏర్పాటు చేస్తున్నారు.