ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో బ్యాక్టీరియా ఉందన్న వార్తలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా స్పందించారు. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఆ చోటు ఎంతో పవిత్రమైందని.. ఆ నీళ్లను తాగొచ్చని చెప్పారు. సనాతన ధర్మం, గంగామాతపై ఫేక్ వీడియోలు, వార్తలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. నీటిని పరిశీలించిన CPCB.. అందులో బ్యాక్టీరియా ఉందని, స్నానానికి పనికిరాని NGTకి నివేదిక సమర్పించింది.