BRS పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని BJP నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘కాంగ్రెస్ గ్యారంటీల గారడీ 6 అబద్దాలు.. 66 మోసాలు’ పేరుతో ఆదివారం హైదరాబాద్ లో ఛార్జ్‌షీట్ విడుదల చేసి మాట్లాడారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో అప్పటి BRS ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే.. కాంగ్రెస్ అమలువీలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.