ఏపీలోని విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు స్కూల్ వెల్ నెస్ టీమ్స్ ఏర్పాటు చేశామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాట్రన్ అంటూ ఏమీ లేదని అన్నారు. 2016లో ఆరుగురు చనిపోతే, 2019లో నలుగురు చనిపోయారన్నారు. 2023లో 17మంది, 2024లో ఆరుగురు చనిపోయారన్నారు. ఇవన్నీ ఇంటర్‌లోనే చోటుచేసుకున్నాయని, యూనివర్సిటీల్లో 2014 నుంచి 18 మంది చనిపోయారన్నారు. ఈ ఆత్మహత్యల నివారణకు అందరూ కృషిచేయాలని మంత్రి తెలిపారు.