యువతీ, యువకుల మధ్య చిగురిస్తున్న ప్రేమకు సమాజంలోని కుల, మతం అడ్డుగోడగా నిలుస్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు ప్రేమ పెళ్లిళ్లను అంగీకరిస్తుంటే.. మరికొందరు ఒప్పుకోవడం లేదు. ప్రేమ పేరుతో కూతురిని దూరం చేశారనో, సమాజంలో పరువు తీశారనో పేరెంట్స్ కక్ష పెంచుకుంటున్నారు. ఫలితంగా పరువు హత్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.