రేవంత్ సర్కార్ పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం, అణిచివేతల రాజ్యం అని కరీంనగర్ BRS కార్యకర్తల సమావేశంలో మండిపడ్డారు. 'ఇదివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క. మళ్లీ BRS అధికారంలోకి తప్పకుండా వస్తుంది. వచ్చాక మా కార్యకర్తలను వేధించే ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా తిరిగి రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం' అని హెచ్చరించారు.