బంగ్లాదేశ్ లోని మైనారిటీ వర్గాలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాయి. మైనారిటీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మైనారిటీ ప్రొటెక్షన్ కమిషన్ ఏర్పాటు చేయాలని, దాడుల నివారణకు కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పార్లమెంటు స్థానాల్లో మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢాకాలోని షాబాగ్ వేదికగా మైనారిటీ వర్గాలు ఉద్యమించాయి.