కేంద్ర ప్రభుత్వం శనివారం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు నటులకు ఈ అవార్డులు వరించాయి. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు, క్లాసికల్ డాన్సర్, నటి శోభనకు పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. అలాగే తమిళ హీరో అజిత్ కుమార్, కర్ణాటక నుంచి కేజీఎఫ్ నటుడు, రైటర్ అనంత్ నాగ్‌కు కూడా ఈ అవార్డు వరించింది. బాలీవుడ్ సింగర్ అరజిత్ సింగ్‌కు పద్మశ్రీ, శేఖర్ కపూర్‌కు పద్మభూషణ్ అవార్డులు వరించాయి.