తెలుగు పండగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకునే నిర్ణయిస్తారు. ఈ సారి కృష్ణాష్టమి రెండు రోజులు వస్తుంది. అయితే అష్టమి తిథులను బట్టి పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
అష్టమి తిథి, రోహిణి నక్షత్రం సమయాలివే
*ఆగస్టు 26 సోమవారం ఉదయం 8.40 నిమిషాల తర్వాత అష్టమి ఘడియలు ప్రారంభం
*ఆగస్టు 27 మంగళవారం ఉదయం 6.49 నిమిషాలకు అష్టమి ఘడియలు ముగింపు
*శ్రీ కృష్ణుడి జన్మనక్షత్రం రోహిణి నక్షత్రం ప్రారంభం: ఆగస్టు 26 సోమవారం రాత్రి 9.23 నిమిషాలకు
*శ్రీ కృష్ణుడి జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ముగింపు: ఆగస్టు 27 మంగళవారం రాత్రి 8.30 నిమిషాలకు