ఉదర క్యాన్సర్ వల్ల 'పాపులోఎరిత్రోడెర్మ' అనే అరుదైన చర్మ సంబంధ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని, దీని వల్ల ముఖంపై చిన్న గడ్డలు ఏర్పడటం, చర్మం పొడిబారి ఊడిపోవడం, దురద, వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చని వైద్యులు చెప్తున్నారు. వీరిలో శోషరసగ్రంథుల వాపుతో పాటు ఆకలి కాకపోవడం, ఒకేసారి బరువు తగ్గడం, కడుపు నొప్పి, గుండెల్లో మంట, అజీర్ణం, వాంతులు, హిమోగ్లొబిన్ లోపం వంటి లక్షణాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.