తెలుగు రాష్ట్రాల్లో
బీజేపీ హైకమాండ్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ
బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని, ఏపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్యకుమార్ ను నియమించనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి నేడు సాయంత్రం
బీజేపీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. బండి సంజయ్, సోము వీర్రాజుకు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని
బీజేపీ చీఫ్ నడ్డా సీనియర్ నేతలతో తెలిపారు.