ప్రెషర్ కుక్కర్ పేలకుండా తీసుకోవాల్సిన ఆరు జాగ్రత్తలు ఇవే

550చూసినవారు
ప్రెషర్ కుక్కర్ పేలకుండా తీసుకోవాల్సిన ఆరు జాగ్రత్తలు ఇవే
ప్రెజర్ కుక్కర్ లో వంట చేయడం చాలా సులభం. అయితే దీనిని సక్రమంగా వాడకపోతే ప్రమాదాలు సంభవిస్తాయి. ఒక్కోసారి ప్రెషర్ కుక్కర్లు పేలుతుంటాయి. పేలుడును నివారించాలంటే కుక్కర్లోని ఆవిరిని బయటకు పంపే వాల్వ్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. కుక్కర్ సామర్థ్యానికి మించి ఆహారాన్ని ఉడికించకూడదు. నీరు లేకుండా కుక్కర్ ను ఉపయోగించొద్దు. ప్లాస్టిక్ పాత్రలను కుక్కర్ లోపల పెట్టి వండకూడదు. గ్యాస్కెట్ పగిలినా, వదులుగా ఉన్నా వాడకూడదు. ఆవిరి మొత్తం బయటకు పోయాకే మూత తీయాలి.

సంబంధిత పోస్ట్