పక్షవాతం వచ్చాక బాధపడేకన్నా రాకుండా చూసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒత్తిడి మూలంగా శరీరంలో వాపు తలెత్తుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అధిక రక్తపోటు పక్షవాతం ముప్పును పెంచుతుంది. రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలి. అధిక బరువు తగ్గాలి. పీచు ఎక్కువగా తినాలి. స్మోకింగ్ మానెయ్యాలి, వీటివల్ల పక్షవాతాన్ని తగ్గించవచ్చు.