ఈ రాశుల వారు మరో రెండేళ్లు జాగ్రత్తగా ఉండాలి!

3486చూసినవారు
ఈ రాశుల వారు మరో రెండేళ్లు జాగ్రత్తగా ఉండాలి!
జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహం ప్రత్యేకమైనది. శని ప్రభావం మనపై చాలా కాలం ఉంటుంది. గత నెల 17న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించింది. శనిగ్రహం 2025 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అందువల్ల అప్పటి వరకు పలు రాశుల వారు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటకం: రాబోయే రోజుల్లో మీకు కష్టాలు రావొచ్చు. పని చేసే చోట ఒత్తిడికి గురవుతారు.

కన్య : ఈ రాశి వారు 2025 వరకు అనారోగ్య సమస్యలు, అపజయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబంలో గొడవలు పెరగవచ్చు. మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వృశ్చిక: ఈ రాశి వారికి కుటుంబ ఆస్తికి సంబంధించి గొడవలు ఉండవచ్చు. వ్యాపారంలో వచ్చే ఏడాది శుభప్రదంగా ఉండదు.

కుంభం: ఈ రాశివారు మరో రెండేళ్లు ఉద్యోగం, వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్