వచ్చే నెల 9న శని కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం వల్ల 4 రాశుల వారికి ఆర్థిక సమస్యలు పోయే అవకాశం ఉంది. మకర రాశి వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. తులా రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశం ఉంది. వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశముంది. వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరగవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు.